Mana Indur News
వ్యాపారం

భారీగా పడిపోయిన సిల్వర్ ధర.. ఒక్కరోజులోనే రూ. 20 వేలు పతనం..మే 16వ తేదీ శనివారం వెండి ధరలు ఇవే

నేడు మే 16వ తేదీ శనివారం వెండి ధర ఇలా ఉంది. ఒక కేజీ సిల్వర్ ధర 271,720 రూపాయలు పలుకుతోంది. వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన భారీ సెల్ ఆఫ్ కారణంగానే వెండి ధరలు తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

KA
By KARKA RAMESHMay 16, 2026
3
Share
భారీగా పడిపోయిన సిల్వర్ ధర.. ఒక్కరోజులోనే రూ. 20 వేలు పతనం..మే 16వ తేదీ శనివారం వెండి ధరలు ఇవే

నేడు మే 16వ తేదీ శనివారం వెండి ధర ఇలా ఉంది. ఒక కేజీ సిల్వర్ ధర 271,720 రూపాయలు పలుకుతోంది. వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన భారీ సెల్ ఆఫ్ కారణంగానే వెండి ధరలు తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి గమనించినట్లయితే గ్లోబల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర కేవలం ఒక్క రోజులోనే ఎనిమిది శాతం వరకు నష్టపోయింది. ప్రస్తుతం ఒక ఔన్స్ సిల్వర్ ధర 76 డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతున్నట్లు గమనించవచ్చు.

ఇక దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే ఎంసీఎక్స్‌లో సిల్వర్ ధర సుమారు 21,600 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 2.75 లక్షల రూపాయల వద్ద సిల్వర్ ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఈ వారంలో వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగినట్లు గమనించవచ్చు. ఒక ఔన్స్ 90 డాలర్లను తాకింది. 90 డాలర్ల నుంచి మళ్లీ వెండి ధర పడిపోవడం చూడవచ్చు. ముఖ్యంగా గరిష్ట స్థాయి వద్ద నుంచి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ లాభాలను వెండి నుంచి బయటకు తీయడం ప్రారంభించారు. దీంతో వెండికి డిమాండ్ తగ్గి ఒక్కసారిగా ధర తగ్గినట్లు గమనించవచ్చు.

దీనికి ప్రధాన కారణం అమెరికాలో ఇటీవల విడుదలైన ఇన్ఫ్లేషన్ డేటా కారణంగా భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వెండి, బంగారం వంటి విలువైన లోహాలపై ఇన్వెస్ట్ చేసేవారు అమ్మకాలకు దిగడం చూడవచ్చు. అలాగే అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే ఆదాయం పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే యూఎస్ జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు వడ్డీ కూడా లభించని బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 2