Mana Indur News
స్థానిక వార్తలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో

భీంగల్ లో ఉద్రిక్త వాతావరణం.

Ma
By Mahesh •October 5, 2026
1033
Share
అఖిలపక్షం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో

అఖిల పక్షం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో

మన ఇందూర్ న్యూస్ / భీంగల్ :


పోలీసుల వేధింపులకు భయపడి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన పొలాస సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి, ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులతో కలిసి సోమవారం ఆందోళన చేపట్టారు.

సుధాకర్ ఆత్మహత్యాయత్నం ఘటన అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో పాటు సంఘం సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట బైఠాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఎస్ఐ సత్తార్ తమను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.బాధితుడి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన రోడ్డుపై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై పోలీసుల వివరణ, అధికారికంగా నమోదైన కేసు వివరాలు తెలియాల్సి ఉంది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5