Mana Indur News
స్థానిక వార్తలు

సైబర్ మోసానికి గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ మోసానికి 1930 నంబర్‌కు సమాచారం అందించాలి.

KA
By KARKA RAMESH•November 19, 2026
2
Share
సైబర్ మోసానికి గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ మోసానికి గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ మోసానికి 1930 నంబర్‌కు సమాచారం అందించాలి.

ఘనంగా NDCC బ్యాంక్ 104వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

సైబర్ మోసానికి గురి కాకుండా బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ బ్యాంకు CEO నాగభూషణం వందే అన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (NDCC Bank) 104వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం పలు సామాజిక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. లక్ష్మీనారాయణ, బ్యాంకు CEO నాగభూషణం వందే, GM T. అనుపమ, GM శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. CEO నాగభూషణం వందే స్వయంగా రక్తదానం చేయగా, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా కోర్టు చౌరస్తా, పాస్‌పోర్ట్ కార్యాలయం మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. OTP, ATM PIN, పాస్‌వర్డ్‌లను ఎవరికీ తెలియజేయకూడదని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.సామాజిక బాధ్యతలో భాగంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు స్కూల్ కిట్స్,పండ్లు, అవసరమైన వస్తువులు అందజేశారు. అదేవిధంగా చింతకుంటలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్లాకెట్స్, ,పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, వారితో కొంత సమయం గడుపుతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయత, మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ బ్యాంకు CEO నాగభూషణం వందే మాటలాడుతూ..గత 104 సంవత్సరాలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు, ఖాతాదారులకు విశిష్టమైన సేవలందిoచడం గొప్ప విషయం అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి NDCC బ్యాంకు విశేష కృషి చేస్తోంది. బ్యాంకింగ్ సేవలతో పాటు సామాజిక బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతోందనీ, బ్యాంకు సిబ్బంది అంకితభావం, ఖాతాదారుల ఆదరణతో బ్యాంకు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు మరియు సహకార కుటుంబ సభ్యులందరికీ 104వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5