డి.ఎం.ఇ.తో సిపిఐ, ఏఐటియుసి నాయకులతో చర్చలు
సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలి

డి.ఎం.ఇ.తో సిపిఐ, ఏఐటియుసి నాయకులతో చర్చలు
సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలి
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
డి.ఎం.ఇ తో సిపిఐ, ఏఐటియుసి నాయకులతో చర్చలు జరుగుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని AITUC రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ అన్నారు. నిజామాబాద్ జిజిహెచ్ లో శుక్రవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి AITUC రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ.. నిన్న మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ , వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మరియు సిపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో డిఎంఇ ని కలిసి జీతాల పెంపుదలపై చర్చలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చొరవతో చర్చలు సాఫీగా సాగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ ఉద్యోగుల వేతనాలు రూ.20,243లకు పెంచటానికి ఒప్పుకున్నారన్నారు పిఎఫ్ షేర్ క్రింద రూ.1800లు + ఇయస్ఐ షేర్ క్రింద రూ.152లు అనగా మొత్తం రూ.1952లు మినహాయించగా కార్మికుల చేతికి రూ.18291లు చేతికి వచ్చేటట్లు డిఎంఇ డాక్టర్ వాణి ప్రతిపాదించారన్నారు. యూనియన్ నాయకులు మొత్తం వేతనం పైన ఇయస్ఐ, పిఎఫ్ కట్ చేయాలని, కార్మికుని వాటాతో పాటు యాజమాన్యం వాటా కూడా కలిపి కార్మికుల ఖాతాల్లో జమచేయాలని, అలాగే సంవత్సరానికి 4 పండగ, 4 జాతీయ, 20 రోజుల హజరుకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫారంగా, ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలని గతంలో డిమాండ్ లెటర్ ఇచ్చామన్నారు. ఆ అంశాలపై స్పష్టత లేకుండా ఒప్పుకోవటం సాధ్యం కాదని యూనియన్ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, మళ్ళీ ఒక సమావేశం యూనియన్ నాయకులతో నిర్వహించి సమస్యను సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిఎంఇకి సూచించారని గుర్తు చేశారు. డిఎంఇ ఒక వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్ని విషయాలు చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, యూనియన్ తలపెట్టిన పోరాట కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని, న్యాయమైన కోర్కెలు పరిష్కారం కాని యడల భవిష్యత్తు పోరాటాలను నిర్ణయించుకొని ముందుకు వెళ్తామన్నారు ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి ఎండి. ఫిరోజ్ అలీ, యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, హైమది, స్వరూప, కవిత, భారతి, వెంకటేష్, సాయిలు తదితర కార్మికులు పాల్గొన్నారు.






