Mana Indur News
స్థానిక వార్తలు

భీంగల్ బాపూజీ నగర్ కాలనీలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన భీంగల్ ఎస్ ఐ తిరుపతి

Ku
By Kune Jithendhar •October 16, 2026
468
Share
భీంగల్ బాపూజీ నగర్ కాలనీలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

భీంగల్ బాపూజీ నగర్ కాలనీలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మన ఇందూర్ న్యూస్/భీంగల్

కుటుంబ మనస్పర్తల కారణంగా ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీంగల్ మండల కేంద్రంలోని బాపూజీనగర్ కాలనీలో చోటుచేసుకొంది. ఎస్ ఐ తిరుపతి తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాపూజీనగర్ కాలనిలో నివాసం ఉంటున్న దావూద్ స్వస్థలం కోరుట్ల మండలానికి చెందినవారు కాగా, గత 15 సంవత్సరాల నుంచి భీంగల్ లోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా కోరుట్లలో తన తల్లి, చెల్లెలు కలిసి ఉంటుండగా వారు ఉన్న ఇల్లు అమ్మే విషయమై వారి మధ్య మనస్పర్థలు, వివాదాలు తలెత్తాయి. ఈ విషయమై దావుద్ కుమారుడు షేక్ రహీం రెండు రోజుల క్రితం కోరుట్ల వెళ్లి నిన్న సాయంత్రం 6:30 గంటలకు తిరిగి భీంగల్ కు వచ్చాడు. రాత్రి నిద్రపోగా, శుక్రవారం ఉదయం సుమారు 4:00 గంటలకు అతని భార్య పని నిమిత్తం బయటకు వెళ్లగా, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఇంట్లో వారి పిల్లలు బయట ఉండగా, గది తలుపులు లోపల నుండి గడి వేసి ఉండటంతో పిల్లలు ఎంత పిలిచిన తలుపు తీయలేదు. వెంటనే అతని కూతురు కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా షేక్ రహీం రేకుల పైకప్పుకు ఉన్న ఇనుప రాడ్ కు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతుని భార్య షేక్ షహీనా ఫిర్యాదు ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5