నేడు జిల్లాకు రానున్న ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చేయూత పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత కార్యక్రమాలలో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇంచార్జి మంత్రి పాల్గొననుండగా, కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, డీఆర్డీఏ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.






