అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ – జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త శకం
జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో మరింత ఖచ్చితత్వం

అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ – జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త శకం
జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో మరింత ఖచ్చితత్వం
యశోద హాస్పిటల్స్, సీనియర్ కన్సల్టెంట్ – సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మినీ మల్లీ ఇన్వేసివ్ లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ సుధీర్ మూడద్ల
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
ఆధునిక వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్సా విధానాల్లో వస్తున్న సాంకేతిక అభివృద్ధి వైద్య చికిత్సలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోందని డా. సుధీర్ మూడద్ల అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద సెంటర్ లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్, సీనియర్ కన్సల్టెంట్ – సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మినీ మల్లీ ఇన్వేసివ్ లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ సుధీర్ మూడద్ల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఆధునిక విధానాలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో మరింత ఖచ్చితత్వం, మెరుగైన దృశ్య స్పష్టత మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలను అందించేందుకు దోహదపడుతున్నాయి. ఆహారనాళం, కడుపు, కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి, చిన్నపేగు, పెద్దపేగు మరియు పురీషనాళానికి సంబంధించిన అనేక వ్యాధులకు అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా ఉపయోగించబడుతున్నాయన్నారు. హై-డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యాధునిక శస్త్రచికిత్సా పరికరాలు మెరుగైన కదలికల సామర్థ్యం కలిగిన సాంకేతికతతో, చిన్న కోతల ద్వారానే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా మరింత ఖచ్చితత్వంతో నిర్వహించడం సాధ్యమవుతోందన్నారు. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయని చిన్న కోతలతో శస్త్రచికిత్స, తగిన రోగుల్లో శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గడం,కొన్ని శస్త్రచికిత్సల్లో రక్తస్రావం తగ్గడం, వేగంగా కోలుకోవడం రోజువారీ కార్యకలాపాలకు త్వరగా తిరిగి చేరుకోవడం జరుగుతుందన్నారు. తగిన సందర్భాల్లో ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గడం క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం, నేటి ఆధునిక శస్త్రచికిత్స అంటే కేవలం చిన్న కోతలకే పరిమితం కాదని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన సర్జన్ల నైపుణ్యం, రోగి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ మెరుగైన వైద్య ఫలితాలను సాధించడమే దీని ప్రధాన లక్ష్య మన్నారు.యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్లో అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తూ, క్లిష్టమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు ఆధునిక, సురక్షితమైన సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామన్నారు.






