రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పల్లికొండ శివారులో స్కూటీ అదుపుతప్పి ప్రమాదం.. చికిత్స పొందుతూ 11న రాత్రి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మన ఇందూర్ న్యూస్/భీంగల్:
భీంగల్ మండలం పల్లికొండ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడా తండాకు చెందిన రామావత్ రవి (38) మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసుల తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఈ నెల 10న సాయంత్రం భీంగల్ మండలం చౌడా తండాకు చెందిన రామావత్ రవి (38) నాలుగేళ్ల కుమారుడు జస్వంత్‌తో కలిసి భీంగల్ ఆసుపత్రికి వెళ్లి, కొత్త జూపిటర్ 125 స్కూటీపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పల్లికొండ శివారులో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో రవికి తల, చేతికి గాయాలు కాగా, కుమారుడి ముఖానికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రవి ఈ నెల 11న రాత్రి మృతి చెందాడు. మృతుడి బావ ఫిర్యాదు మేరకు భీంగల్ పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.






