కలెక్టరేట్ లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం శిబిరం ప్రారంభించిన మంత్రి సీతక్క
ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో లబ్దిదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

కలెక్టరేట్ లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం శిబిరం ప్రారంభించిన మంత్రి సీతక్క
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:నిజామాబాద్, నవంబర్ 20 :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో లబ్దిదారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సీ హాల్ లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం రాత్రి ప్రారంభించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ ఆఫీసులు, మండల కేంద్రాలోని గ్రామ పంచాయతీలలో శిబిరాలను అందుబాటులోకి తెచ్చామని, అందులో భాగంగానే వివిధ పనుల కోసం కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్ధం ఐ.డీ.ఓ.సీ లో కూడా ప్రత్యేకంగా బీమా నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి దృష్టికి తెచ్చారు. మొదటి రోజునే జిల్లా వ్యాప్తంగా 2687 మంది జీవిత బీమా పథకంలో వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 5లక్షల రూపాయల ఆర్ధిక భరోసా అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులోకి తెచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, డీ.ఆర్.ఓ గీత, సీపీఓ రతన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






