Mana Indur News
వ్యాపారం

మాధవనగర్ అర్ ఓ బి వద్ద ఇరుక్కుపోయిన టిప్పర్..

నిజామాబాద్ వైపు రాక పోకలకు ఇబ్బందులు

KA
By KARKA RAMESH•September 19, 2026
2
Share
మాధవనగర్ అర్ ఓ బి వద్ద ఇరుక్కుపోయిన టిప్పర్..

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

నిజామాబాద్ మాధవనగర్ వద్ద అర్ ఓ బి పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో ప్రతి రోజు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతి పక్షాలు ఎన్ని సార్లు నిరసనలు ధర్నాలు చేసిన పలితం లేకుండా పోయింది. ఇటీవల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. అయినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వాహన దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. రెండు వైపుల వాహనదారులు వెళ్ళేందుకు ఏర్పాటు చేసిన రోడ్డు అధ్వానంగా తయారయింది. శనివారం నిజామాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ మద్యలో ఇరుక్కుపోవడంతో వెనక నుంచి వచ్చే వాహన దారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధికారులు రోడ్డు కు తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని, ప్రజలు కోరుతున్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5