ఇందిరమ్మ ఇళ్లు... కేంద్రం వాటా కోసం ఎదురు చూస్తున్నాం: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు ఒక లక్షా 13 వేల రూపాయిల వాటా విడుదల కావాల్సి ఉందని చెప్పారు. కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్లులు ఆపడం జరిగిందని అన్నారు. అయితే ఆ నిధుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజున మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా కేంద్రాని అభ్యర్థన చేశానని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని... ఈ క్రమంలోనే ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 1.60 లక్షల రూపాయిలను తాత్కాలికంగా ఆపామని తెలిపారు. ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. జూన్ నెలాఖరుకల్లా 68 నుంచి 72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.





