TG EAPCET Results 2026 :తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల... టాప్-10 ర్యాంకర్లు వీరే,ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈఏపీ సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేవలు ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TG EAPCET- టీజీ ఈఏపీసెట్ ) 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలను ఆదివారం (మే 17) రోజున ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేవ విడుదల చేశారు.ఈ పరీక్షా ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలురాశారు. ఈ ఫలితాలు తెలుసుకునేందుకు, ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ను సందర్శించాలని సూచించారు. ఇందుకోసం విద్యార్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ సలహాదారు ఇతర అధికారులు అభినందనలు తెలియజేశారు.






