మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు మున్నూరు కాపు సంఘం కృతజ్ఞతలు

మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు మున్నూరు కాపు సంఘం కృతజ్ఞతలు
మన ఇందూర్ న్యూస్/నార్సింగ్:
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పలువురు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, నరాల రత్నాకర్, గాలి అనిల్ కుమార్, కొలగాని మహేష్, తదితరులు పాల్గొన్నారు.






