Ebola: ఎబోలా వైరస్ వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)
పంచ ఆరోగ్య సంస్థ (WHO), DR కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
ఎబోలా వైరస్‌కు టీకా అందుబాటులో లేదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని తూర్పు ఇటూరి ప్రావిన్స్‌లో ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగోలో ఇప్పటి వరకు 246 ఎబోలా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. 80 మరణాలు నమోదయ్యాయి.
ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కాంగో, ఉగాండా దేశాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వ్యాప్తిని తగ్గించడానికి, వైరస్ సోకిన వ్యక్తులను వెంటనే ఐసోలేట్ చేసి, కనీసం 48 గంటల వ్యవధిలో పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ వచ్చేంత వరకు వైద్య చికిత్సలు అందించాలని WHO తెలిపింది.
1976లో తొలిసారిగా ఎబోలా వైరస్‌ను గుర్తించారు. ఇది గబ్బిలాల నుండి వ్యాపిస్తుందని భావిస్తున్నారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో దేశంలో ఈ ప్రాణాంతక ఎబోలా వ్యాప్తి చెందడం ఇది 17వ సారి. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
ఎబోలా వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే!
తీవ్రమైన జ్వరం
నీరసం ఎక్కువగా ఉండటం
తలనొప్పిగా ఉండటం
కండరాల నొప్పి
వాంతులు , విరేచనాలు
కొన్ని సందర్భాల్లో తీవ్రమైన రక్తస్రావం, అవయవాలు పనిచేయకపోవడం జరుగుతుంది.
కాంగో దేశంలో కొన్ని నెలల క్రితమే ఎబోలా వైరస్ కేసులు నమోదయ్యాయి. సుమారుగా 5 నెలల క్రితం ఎబోలా వైరస్ సోకి 43 మంది





