Mana Indur News
స్థానిక వార్తలు

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం

పచ్చల నడుకుడ గ్రామాలలో 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

MI
By Mana Indur News•September 17, 2026
1
Share
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం


మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా

సైబర్ నేరాల నియంత్రణ మరియు డ్రగ్స్ నియంత్రణ లో ప్రజలు అప్రమంతముగా ఉండవలెను

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానమని, సైబర్ నేరాల నియంత్రణ డ్రగ్స్ నియంత్రణ లో ప్రజలు అప్రమంతముగా ఉండవలెనని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు.
గురువారం సాయంత్రం సమయంలో వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చల నడుకుడా గ్రామ పంచాయతీ కార్యాలయలో  మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 16 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని , సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని , నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సి సి కెమెరా లను పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యత గా తీసుకోవాలి. దుకాణాల యజమానులు తప్పనిసరిగా  సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పచ్చల నడుకుడ   గ్రామంలో 16 కెమెరాలు పెట్టి సహకరించిన అన్వేష్ రెడ్డి గ్రామ పంచాయతీ ను పోలీస్ కమీషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా పచ్చల నడుకుల  గ్రామాలలో డ్రగ్స్ నివారణ సైబర్ నేరాల పట్ల అవగాహన  రోడ్డు ప్రమాదాలను నివారణ  కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. అనంతరం రెడ్డీస్ యూత్ గణేష్ మండలి వద్ద యువత సన్మార్గంలో నడవడానికి తీసుకోవలసినటువంటి మెలకువలు గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,  ఆర్మూర్ ఎ.సి.పి. శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి , వేల్పూర్ ఎస్.ఐ సంజీవ్,  సర్పంచ్ కొల్లే నరసయ్య , ఉపసర్పంచ్ రఘుపతి , మాజీ సొసైటీ  లింభారెడ్డి గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5