Mana Indur News
స్థానిక వార్తలు

రూ.100 కోట్ల డిపాజిట్ల మైలురాయి అధిగమించిన ఎన్‌డీసీసీ బ్యాంక్ హెడ్ ఆఫీస్

సిబ్బందిని అభినందించిన బ్యాంకు సీఈఓ నాగభూషణం వందే.

KA
By KARKA RAMESH•September 28, 2026
3
Share
రూ.100 కోట్ల డిపాజిట్ల మైలురాయి అధిగమించిన ఎన్‌డీసీసీ బ్యాంక్ హెడ్ ఆఫీస్

రూ.100 కోట్ల డిపాజిట్ల మైలురాయి అధిగమించిన ఎన్‌డీసీసీ బ్యాంక్ హెడ్ ఆఫీస్

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:

నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (NDCCB) ప్రధాన కార్యాలయం రూ.100 కోట్ల డిపాజిట్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా బ్యాంకు సీఈఓ నాగభూషణం వందే ప్రధాన కార్యాలయ సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. సీఈఓ నాగభూషణం వందే మాట్లాడుతూ..ప్రధాన కార్యాలయ సిబ్బంది సమష్టి కృషి, ఖాతాదారుల నమ్మకం సహకారంతో ఈ మైలురాయిని సాధించడం జరిగిందని తెలిపారు. 104 సంవత్సరాలకు పైగా ప్రజలకు విశ్వసనీయమైన సేవలు అందిస్తున్న ఎన్‌డీసీసీ బ్యాంకుపై ఖాతాదారులు ఉంచుతున్న నమ్మకమే ఈ విజయానికి ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో బ్యాంకులోని అన్ని శాఖలు డిపాజిట్ల సమీకరణకు మరింత ప్రాధాన్యతనిస్తూ, తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న ‘సంపద’ డిపాజిట్ పథకం ద్వారా సాధారణ ఖాతాదారులకు 8 శాతం సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ అందిస్తున్నామని, ఈ పథకాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సీఈఓ తెలిపారు.ఈ విజయానికి సహకరించిన ప్రధాన కార్యాలయ సిబ్బంది, అధికారులు ఎన్‌డీసీసీ బ్యాంకుపై నమ్మకంతో తమ డిపాజిట్లను ఉంచిన ఖాతాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5