Mana Indur News
క్రీడలు

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక.

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక.

Ku
By Kune Jithendhar •November 2, 2026
16
Share
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక.

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక.

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక.

మన ఇందూర్ న్యూస్/భీంగల్:

భీంగల్ పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం ఎస్‌జీఎఫ్ భీంగల్ అర్బన్ స్థాయి అండర్‌-17 బాలురు, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో భీంగల్ అర్బన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను తుది జట్లకు ఎంపిక చేసినట్లు భీంగల్ అర్బన్ ఇంచార్జీ సెక్రటరీ సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు మంగళవారం నందిపేట్‌లో జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) స్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలని, చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నిరంతర వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచిస్తూ, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృషి హైస్కూల్ కరస్పాండెంట్ అజిత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్, లింగం, అభిషేక్, రాకేష్, ప్రశాంత్, సుమన్, గంగాధర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5