Mana Indur News
క్రీడలు

జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో శ్రీనికేష్‌కు రెండు స్వర్ణాలు

భోపాల్‌లో మెరిసిన తెలంగాణ అంతర్జాతీయ పారా స్విమ్మర్

MI
By Mana Indur News•November 17, 2026
6
Share
జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో శ్రీనికేష్‌కు రెండు స్వర్ణాలు

జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో శ్రీనికేష్‌కు రెండు స్వర్ణాలు

భోపాల్‌లో మెరిసిన తెలంగాణ అంతర్జాతీయ పారా స్విమ్మర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతం నగర్ చెందిన శ్రీనికేష్ కిరణ్ కషత్వర్ సత్తా చాటారు

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ అర్బన్:

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నవంబర్ 12 నుంచి 15 వరకు నిర్వహించిన 26వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని గౌతమ్ నగర్ కు చెందిన చెందిన అంతర్జాతీయ పారా స్విమ్మర్ శ్రీనికేష్ కిరణ్ కషత్వర్ సత్తా చాటారు. మూడు విభాగాల్లో పోటీపడి రెండు స్వర్ణ పతకాలను సాధించారు.50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో 45.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో 1 నిమిషం 39.80 సెకన్లలో పూర్తి చేసి మరో స్వర్ణ పతకాన్ని సాధించారు. అదేవిధంగా 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో 40.15 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం శ్రీనికేష్ బ్లూ డాల్ఫిన్ స్విమ్ క్లబ్‌లో శిక్షణ పొందుతున్నారు. నిరంతర సాధన, క్రమశిక్షణతో క్రీడారంగంలో రాణిస్తున్న ఆయన, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.జాతీయ స్థాయి పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించడం పట్ల క్రీడాభిమానులు, జిల్లా ప్రముఖులు పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనికేష్ విజయం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని అభినందిoచారు..

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5