Mana Indur News
క్రీడలు

ఇందూరుకు స్టేడియం తీసుకురావడమే నా లక్ష్యం..

ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడా పోటీల్లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

MI
By Mana Indur News•November 10, 2026
6
Share
ఇందూరుకు స్టేడియం తీసుకురావడమే నా లక్ష్యం..

ఇందూరుకు స్టేడియం తీసుకురావడమే నా లక్ష్యం..

ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడా పోటీల్లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ అర్బన్:

ఇందూరులో స్టేడియం తీసుకురావడమే తన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాగారంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్టేడియం కోసం ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. ఇందూరులో స్టేడియం నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గత 10 ఏళ్లుగా నిర్విరామంగా అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం క్రీడా పోటీలనే కాకుండా పోలీసు, ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణను కూడా ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో తర్ఫీదు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పుష్కలంగా లభిస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే నగరానికి చెందిన హాకీ క్రీడాకారిణి యెండాల సౌందర్య, బాక్సర్లు నిఖత్ జరీన్, హుస్సముద్దీన్, పర్వతారోహకురాలు మలావత్ పూర్ణాకు క్రీడా కోట కింద ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో కైసర్ అకాడమీ ఫౌండర్ ఖైసర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కరాటే రమేష్, కార్పొరేటర్లు ఎండి అన్వర్ అమర్ సింగ్, మఠం పవన్, కో ఆప్షన్ మెంబర్ సురేందర్, ఎంపీజే అబ్దుల్ అజీజ్, అడ్వకేట్ జునేద్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5