జాతీయ స్థాయి అండర్-19 సాఫ్ట్ బాల్ పోటీలకు SR జూనియర్ కళాశాల విద్యార్థిని భవ్య శ్రీ
అభినందించిన ఎస్సార్ కళాశాలల డీజిఎం గోనె గోవర్ధన్ రెడ్డి

జాతీయ స్థాయి అండర్-19 సాఫ్ట్ బాల్ పోటీలకు SR జూనియర్ కళాశాల విద్యార్థిని భవ్య శ్రీ
అభినందించిన ఎస్సార్ కళాశాలల డీజిఎం గోనె గోవర్ధన్ రెడ్డి
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన అండర్-19 ఇయర్స్ సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో నిజామాబాద్ గంగస్తాన్ ఎస్.ఆర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థిని భవ్య శ్రీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు పంజాబ్ రాష్ట్రం లోని చండీగఢ్ లో నవంబర్ 18 నుంచి 22 వరకు జరుగనున్నాయని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వినోద్ రెడ్డి తెలిపారు. భవ్య శ్రీ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్య భవ్యశ్రీ ని ఘనంగా సత్కరించారు. అనంతరం DGM గోవర్ధన్, మాట్లాడుతూ.. మా కళాశాల లో చదువు తో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని రాష్ట్ర,జాతీయ స్థాయిలో మా విద్యార్థులు రాణిస్తున్నారని ఈ సందర్భంగా డీజిఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చదువులో ఇదివరకే రాష్ట్రస్థాయి NEET MBBS లో,NIT,IIT, JEE MAINS, ఎంసెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని,క్రీడల్లో కూడా జిల్లా,రాష్ట్ర,జాతీయస్థాయిలో మా యొక్క కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు..ఈ యొక్క కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్, శ్రీకాంత్, డీన్ రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ హనుమంత్ రావు అధ్యాపకులు,విద్యార్థులు ఆమెను అభినందించి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.






