14 మందికి రూ. 3.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఊరట.
S
By S KISHOR •September 24, 2026
11

.
మన ఇందూర్/భీమ్గల్ రూరల్ :
భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.3,55,500 విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు.ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది,ప్రజల అవసరాలను గుర్తించి,అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.నాయకులు కోరడి లింబాద్రి,అశోక్,అవినాష్,మురారి,అరుణ్ రాజ్,వినీత్ కార్యక్రమంలో ఉన్నారు.






