దర్పల్లిలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.
BI
By BILLA SANTHOSH •September 21, 2026
7

మన ఇందూర్/ ధర్పల్లి:
ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలుకొట్టి నివాళులర్పించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు కొండ్యాల వినోద్ మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను, త్యాగాలను నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు నరేష్, వైభవ్, అక్షయ్, క్యాదరి నారాయణ , బిల్ల పురుషోత్తం, రాజేందర్, నవీన్, సబ్బని గంగాధర్,శ్రీనివాస్,సంఘ సభ్యులు లింబద్రి, బాలే శంకర్, విష్ణు దాస్,పవన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.






