Mana Indur News
కల్చరల్

ఆర్మూర్ ప్రజలకు బౌద్ధ దీపావళికి ఆహ్వానం

యశోబుద్ధ ఫౌండేషన్ తెలంగాణ, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్మూర్, అల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో

KA
By KARKA RAMESH•November 7, 2026
5
Share
ఆర్మూర్ ప్రజలకు బౌద్ధ దీపావళికి ఆహ్వానం

ఆర్మూర్ ప్రజలకు బౌద్ధ దీపావళికి ఆహ్వానం

మన ఇందూర్ న్యూస్/ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో "బౌద్ధ జ్ఞాన దీపావళి" వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సిద్ధార్థ గౌతముడు కపిలవస్తుకు తిరిగి వచ్చిన సందర్భంగా నగర ప్రజలు దీపాలతో స్వాగతం పలికిన రోజును చరిత్ర పొడవున "బౌద్ధ జ్ఞాన దీపావళి"గా జరుపుకుంటారని నిర్వాహకులు తెలిపారు. యశోబుద్ధ ఫౌండేషన్ తెలంగాణ, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్మూర్, అల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో సిటీలోని హౌసింగ్ బోర్డు లోని బుద్ధుడి విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేటపుడు కుటుంబం, ప్రతి వ్యక్తి, కార్యకర్త తెల్లని దుస్తులు ధరించి, దీపాలు క్యాండిల్ తో రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర వివరాలకు ఎం. మాలజీ :9869010890 సంప్రదించాలి.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5