Mana Indur News
కల్చరల్

భీంగల్ లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

అతిథి గృహం నిర్మాణ పనులకు భూమి పూజ. స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

MI
By Mana Indur News•November 20, 2026
3
Share
భీంగల్ లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

భీంగల్ లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

అతిథి గృహం నిర్మాణ పనులకు భూమి పూజ

స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మన ఇందూర్ న్యూస్/ భీంగల్ :

నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టను సందర్శించి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్రను ఆలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్ద రూ.4 కోట్ల నిధుల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి సీతక్కకు పూల మొక్క అందించి ఘన స్వాగతం పలుకుగా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్త ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5