2 వేల రోజుల అన్నదాన సేవ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతరం సేవ కార్యక్రమాలు.

ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతరం నిర్వహిస్తున్న అన్నదాన సేవ కార్యక్రమానికి సంబంధించిన
2 వేల రోజుల అన్నదాన సేవ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
నిజామాబాద్, నవంబర్ 10: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీ ఆదివారం నాటికి సరిగ్గా 2 వేల రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ నెల 16వ తేదీ సోమవారం నిర్వహించనున్న 2,000 రోజుల అన్నదాన సేవా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం కలెక్టర్ చాంబర్లో ఆవిష్కరించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవలను సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వివరించారు నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆకలితో ఉన్న నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యులకు ప్రతి రోజు అన్నదానం చెయ్యడం జరుగుతుందని తెలిపారు .ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీ ఆదివారం నాటికి 2,000 రోజులు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో ఉన్న ఎస్.ఆర్ గర్ల్స్ జూనియర్ కళాశాల (ఓల్డ్ ఎంఎస్ఆర్ కళాశాల)లో 2,000 రోజుల అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నమణి కలెక్టర్‌కి తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.అనంతరం కార్యక్రమానికి సంబంధిన పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, సంస్థ ప్రతినిధి రామగిరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






