తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు నిజామాబాద్ జానపద ధూమ్ దాం కళాకారులు
సిరిసిల్లకు బస్సులో బయలు దేరిన నిజామాబాద్ జానపద కళాకారులు

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు నిజామాబాద్ జానపద ధూమ్ దాం కళాకారులు
సిరిసిల్లకు బస్సులో బయలు దేరిన నిజామాబాద్ జానపద కళాకారులు
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా అంటేనే కళాకారుల ఐక్యతకు మారుపేరని అధ్యక్ష కార్యదర్శులు ఆర్టీసీ శ్రీనివాస్, అష్ట గంగాధర్ అన్నారు.
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించగా మంగళవారం నిజామాబాద్
ధూమ్ దాం, జానపద కళాకారులు బస్సులో బయలుదేరారు. కళమా తల్లి ముద్దుబిడ్డలం
అందరం ఓకే వాహనంలో తరలి వెళ్లడం సంతోషంగా ఉందని కళాకారులు జిల్లా కళాకారుకు తెలిపారు. సినీ ఇండస్ట్రీ తో పాటు ఫోక్ ఇండస్ట్రీ కి ఆదరణ పెరుగుతున్న సమయంలో సిరిసిల్లలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా మంచి మంచి కళాకారులు ఉన్నారని, రానున్న రోజుల్లో మంచి మంచి పాటలు చేయాలని కోరుకుంటున్నామన్నారు.
ఈ బస్సు యాత్రలో కోశాధికారి రాంపూర్ సాయి, కళాకారులు సాయి లవోల,గోదావరి, గోరకంటి రాజు, ప్రశాంత్ రెడ్డి, కర్క రమేష్, మీనా, మాదాస్ గోపి, మనోజ, సమత, చిన్న రాజేందర్, మహేందర్, డప్పు సంతోష్, స్రవంతి, ధర్పల్లి సాయి, డప్పు మహేష్, నరేష్,
శ్రవణ్, రాజు సిరిసిల్ల కు బయలు దేరారు.






