Mana Indur News
కల్చరల్

సామాజిక సమస్యలపై పిలుపు

సమాజంలోని రుగ్మతలను తొలగించే విధంగా అన్ని కవితలు

KA
By KARKA RAMESH•November 14, 2026
17
Share
సామాజిక సమస్యలపై పిలుపు

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:

సమాజంలోని రుగ్మతలను తొలగించే విధంగా అన్ని కవితలు ఆలోచింపజేస్తున్నాయని వక్తలు అన్నారం సామాజిక సమస్యలపై పిలుపు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి రచయిత గాయకుడు గఫూర్ శిక్షక్. ప్రముఖ కవి రచయిత బి ప్రేమ్ లాల్ సామాజిక సమస్యలపై రచించిన కవిత సంపుటిలో నీటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ ఎల్ నినో ప్రభావం భవిష్యత్తు తరాలు ఈ విషయమై జాగ్రత్తలను తన కవితల ద్వారా వివరించిన తీరు చాలా బాగుందని కవితలని సామాజిక సమస్యలను విశ్లేషిస్తున్నాయని ప్రముఖ కవి రచయిత గఫూర్ శిక్షక్ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో బి ప్రేమ్ లాల్ రచించిన కవితా సంపుటి పిలుపు పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పుస్తకములో పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ యువతకు సూచించే దిశా నిర్దేశం సమాజంలోని రుగ్మతలను తొలగించే విధంగా అన్ని కవితలు ఆలోచింపజేస్తున్నాయని పిలుపు సమాజానికి ఒక పిలుపుగా నిలుస్తుంది అని పుస్తకానికి పెట్టిన శీర్షిక సామాజిక ప్రతిబింబంగా నిలుస్తున్నాయని అన్నారు. పుస్తక రచయిత ప్రేమ్ లాల్ మాట్లాడుతూ..నీటిని సంరక్షించుకోవాలని ప్రస్తుత ఎల్ఈనో ప్రభావం తీవ్ర రూపం దాల్చకముందే సమాజం మేల్కోవాలని అన్నారు ఇలాంటి విషయాలను ఈ పుస్తకంలో తెలియజేశానని అన్నారు ఈ కార్యక్రమంలో సాహితీ అభిమానులు మురళి. మౌనిక విక్రమ్ రాజేందర్ ప్రవీణ్ సురేష్ నరేష్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5