Mana Indur News
స్థానిక వార్తలు

టీయూడబ్ల్యూజే ఎచ్ 143 పోస్ట్ కార్డు ఉద్యమం.

జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణ చేయాలి.

KA
By KARKA RAMESH•October 2, 2026
47
Share
టీయూడబ్ల్యూజే ఎచ్ 143 పోస్ట్ కార్డు ఉద్యమం.

మన ఇందూర్ న్యూస్ /నిజామాబాద్ అర్బన్ :

జర్నలిస్టుల హెల్త్ కార్డులు పునరుద్ధరణ చేసి, క్యాష్ లెస్ హెల్త్ కార్డుల పంపిణీ చేయాలని నిజామాబాద్ టీయూడబ్ల్యూజే ఎచ్ 143 జిల్లా కన్వీనర్ కులకర్ణి రజినీకాంత్, కో కన్వీనర్ నానం మోహన్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ Tuwj H 143 నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్ కార్డులు పునరుద్ధరణ చేయాలన్నారు. క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ, ఈ హెచ్ ఎస్ కాకుండా ఈ జె హెచ్ ఎస్ స్కీం పునరుద్ధరించాలని టీయూడబ్ల్యూజే 143 సంఘం తరఫున విన్నవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ కుమార్, ఆనంద్ పాల్, రాజేష్, కర్క రమేష్, ఆంజనేయులు, విజయ్ కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5