15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులు

మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్ :
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ విశ్రాంత ఉద్యోగి పింఛను ఫైలును సంబంధిత అధికారులకు పంపేందుకు జూనియర్ అసిస్టెంట్ అశోక్ 35వేలు లంచం డిమాండ్ చేశారు.ఒప్పందం మేరకు బాధితుడి నుంచి 15వేలు తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ అశోక్,కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి అనిశా కోర్టులో హాజరుపరుస్తామని ఇన్ ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. తాము చేయాల్సిన పనులకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని నిజామాబాద్ ఇన్ ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ సూచించారు...
#నిజామాబాద్ మున్సిపల్ లో లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ఉద్యోగులు.
#లంచం తీసుకున్న ఉద్యోగులు





