Mana Indur News
స్థానిక వార్తలు

అక్టోబర్ 2న ఛలో నిజామాబాద్ TUWJ IJU

జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.

MI
By Mana Indur News•September 30, 2026
5
Share
అక్టోబర్ 2న ఛలో నిజామాబాద్ TUWJ IJU

అక్టోబర్ 2న ఛలో నిజామాబాద్...

జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ అర్బన్:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం IJU పిలుపులో భాగంగా అక్టోబర్ 2, 2026న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో TUWJ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని TUWJ - IJU, నిజామాబాద్ జిల్లా కమిటీ బాధ్యులు సంజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని పెండింగ్ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం, పిల్లలకు ఉచిత విద్యా కల్పించాలని ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ అనంతరం కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జర్నలిస్టు హాజరు అయ్యేలా చూడాలని కోరుతున్నాం. ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుంది.

ఈ కార్యక్రమంలో మండలాలు, పట్టనాల ప్రెస్ క్లబ్ సభ్యులు, రిపోర్టర్లు అందరూ పాల్గొనేలా చూడాలని మనవి..తమ పరిధిలో ప్రతి ఒక్కరికీ సమాచారం పంపి ఆందోళనలో పాల్గొనేలా చూడగలరు...

ఆందోళన చేద్దాం, సమస్యలు పరిష్కరించుకుందాం..

#TUWJ - IJU, నిజామాబాద్ జిల్లా కమిటీ.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5