2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలి.
రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్,

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్ :
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు.2003 సంవత్సరంలో నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో–57 ఆధారంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా, రేపు నిర్వహించనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కమిటీలకు అతీతంగా 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ వినతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు సానుకూలంగా స్పందించినట్లు సమితి నాయకులు తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో మాడవేడి వినోద్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; గుంటి వేణుగోపాల్, రాష్ట్ర కోశాధికారి; రేండ్ల రాజేష్, సచివాలయ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు; నాయకులు యు. విజయ్ కుమార్, జగన్ తదితరులు పాల్గొన్నారు.






