Mana Indur News
స్థానిక వార్తలు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2027 కు ఉచిత శిక్షణ

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ

KA
By KARKA RAMESH•September 19, 2026
2
Share
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2027 కు ఉచిత శిక్షణ

మన ఇందూర్ నిజామాబాద్ ప్రతినిధి :

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2027కు సన్నద్ధమవుతున్న నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ అందించనున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారి ఆర్ భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు. రాజేంద్రనగర్ లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ సహకరముతో రెసిడెన్సీయల్ విధానములో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ ఇవ్వనుందని, శిక్షణకు అర్హత ఉన్న అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్, ఆప్టిట్యూడ్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయము రూ.3.00 లక్షలకు మించకూడదని తెలిపారు.

అభ్యర్ధులు "welfare.sriramsias.com" వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ నెల 23వ తేదీ సాయంత్రము 6.00 గం.ల వరకు దరఖాస్తూలు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు 9121087421 నంబర్ కి ఉదయము 10.00 గం.ల నుంచి సాయంత్రము 5.00 గం.ల మద్య సంప్రదించాలని తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5