సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో FLNAT పరీక్ష
అమ్మకు అక్షరమాల” కార్యక్రమంలో భాగంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్

మన ఇందూర్ /నిజామాబాద్ సిటీ:
నవ భారత అక్షరాస్యత కార్యక్రమం (NILP)–ULLAS – “అమ్మకు అక్షరమాల” కార్యక్రమంలో భాగంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (FLNAT) పరీక్షను 2026 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్నట్లు శ్రీయుత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (PD, DRDA) జి. సాయన్న తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో గుర్తించిన 31,702 అభ్యాసకులు ఈ FLNAT పరీక్షకు హాజరుకానున్నారు. గతంలో పరీక్షకు హాజరు కాలేకపోయిన లేదా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని అభ్యాసకులను కూడా గుర్తించి, వారిని తిరిగి సమీకరించి పరీక్షకు సిద్ధం చేయడానికి SERP, DRDA, MEPMA, వయోజన విద్యాశాఖతో పాటు మండల, గ్రామస్థాయి సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణ కోసం సంబంధిత VOAs, RPs మరియు ఇతర SERP మరియు MEPMA సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించి, APMలు TMC లు మరియు CCల పర్యవేక్షణలో పరీక్షను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు, పరీక్షా సామగ్రి, అభ్యాసకుల హాజరు తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
FLNAT పరీక్ష సెప్టెంబర్ 27న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ వ్యవధిలో అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో పరీక్షకు హాజరుకావచ్చు. అభ్యాసకులందరూ పరీక్షకు హాజరయ్యేలా ఇంటింటి ప్రచారం, టాంటాం/దండోరా, గోడ రాతలు, ప్రచార కార్యక్రమాలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, VOAs, RPs, వాలంటీర్లు మరియు ఇతర సిబ్బంది సహకారంతో అభ్యాసకులను పరీక్షా కేంద్రాలకు సమీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.నిరక్షరాస్యులకు అక్షరజ్ఞానం అందించాలనే లక్ష్యంతో ULLAS కార్యక్రమాన్ని జిల్లాలో మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్షరాస్యతతో పాటు అభ్యాసకులకు ప్రాథమిక సంఖ్యా పరిజ్ఞానం, రోజువారీ జీవితానికి అవసరమైన జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. జిల్లాలో FLNAT పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు PD, DRDA ఆధ్వర్యంలో SERP, MEPMA, వయోజన విద్యాశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ మరియు ఇతర సంబంధిత సిబ్బంది, వాలంటీర్లు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు సమష్టిగా సహకరించి ULLAS – “అమ్మకు అక్షరమాల” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిరక్షరాస్యత నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, SERP/MEPMA సిబ్బంది, వాలంటీర్లు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు సమష్టిగా సహకరించి ULLAS FLNAT పరీక్షను విజయవంతం చేయాలని, నిరక్షరాస్యత నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
#DRDA, MEPMA ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ సాయన్న.
#FLNAT పరీక్ష






