కోస్గీ పాంచజన్య సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్. 30 వేల మంది హాజరు
కవిత అధికారంలోకి వస్తేనే జీవితాల్లో మారుతాయని ప్రజలు భావిస్తున్నారు.

సభ విజయవంతమయ్యేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల రంజిత్, అర్చన సేనాపతి
మన ఇందూర్ / హైదరాబాద్ :
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అధికారంలోకి వస్తేనే తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారని పార్టీ నాయకులు గొంగళ్ల రంజిత్, అర్చన సేనాపతి అన్నారు. కొడంగల్ నియోజక వర్గంలోని కోస్గీలో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. తమ జీవితాల్లో మార్పు వస్తుందని గతంలో బీఆర్ఎస్ కు, ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఆ రెండు పార్టీలు జిల్లా ప్రజలను ఘోరంగా మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత ప్రకటించిన పాంచజన్యం ద్వారానే తమ జీవితాలు మారుతాయని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం విషయంలో ప్రజలకు కవిత భరోసా ఇచ్చారన్నారు. కోస్గీ సభకు 30 వేల మంది ప్రజలు హాజరవటంతో అటు అధికార, విపక్ష పార్టీల్లో భయం మొదలైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ నిలుస్తుందన్నారు. సభ సక్సెస్ అయ్యేందుకు సహకరించిన వారందరికీ టీఆర్ఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
#బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్
#పాంచజన్య సంకల్ప సభ
#కల్వకుంట్ల కవిత






