Mana Indur News
తెలంగాణ

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్-30 అమలు.

జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల

KA
By KARKA RAMESH•September 30, 2026
17
Share
నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్-30 అమలు.

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్-30 అమలు.

జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల

మన ఇందూర్ న్యూస్/నిర్మల్:

నిర్మల్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ సెక్షన్-30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లావ్యాప్తంగా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచామని తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5