Mana Indur News
తెలంగాణ

బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

Balapur laddu 39 lacs. బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట సరికొత్త రికార్డు. 32 ఏళ్లలో 450 నుంచి 39 లక్షలకు.

KA
By KARKA RAMESH•September 25, 2026
1
Share
బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట సరికొత్త రికార్డు .

మన ఇందూర్/ బాలాపూర్:
బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట సరికొత్త రికార్డు సృష్టించింది. 11 రోజులు వినాయకుడి వద్ద పూజల అందుకున్న లడ్డు వేలంపాట జరుగుతుంది అంటే దేశంలో ఎక్కడినా తీవ్ర పోటీ నెలకొంటుంది. అందులోనూ దేశంలోనే ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న బాలాపూర్ లడ్డు గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈసారి వేలం పాట ఎంత వరకు వెళ్తుంది అని అందరు ఎదురు చూసారు. గతంలో కంటే కూడా 2026
బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు వేలం పాటలో సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.
2026 గణేష్ లడ్డు వేలం పాట జరిగిన హోరాహోరీ వేలం పాటలో సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సామ ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం. గత సంవత్సరం (2025లో) లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు. గతం కంటే ఈసారి ఆ రికార్డును రూ. 4 లక్షల ఎక్కువగా వేలం పాట ద్వారా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.

1994 లో రూ.450, 2026 లో 39 లక్షలు

32 ఏళ్లలో 39 లక్షలకు

1994, 1995 లో రూ.450 లకు వేలం పాట లో దక్కించుకోగా
కరోనా సమయంలో వేలం నిర్వహించలేదు. అనంతరం.
2021 లో రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి లు రూ. 18,90,000,
2022 లో ఒంగేటి లక్ష్మారెడ్డి రూ. 24,60,000 లకు,
2023 దాసరి దయానంద రెడ్డి రూ. 27,00,000 లకు
2024 లో కోలన్ శంకర్ రెడ్డి రూ. 30,01,000 లకు, 2025 లింగాల దశరథ గౌడ్ రూ. 35,00,000 దక్కించుకున్నారు. కాగా 2026 లో అర్బన్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ సామ ప్రణీత్ రెడ్డి గత సంవత్సరం కంటే 4 లక్షలు ఎక్కువగా పాడి రూ. 39,00,000 లకు దక్కించుకోవడం విశేషం. బాలాపూర్ లడ్డు ను దక్కించుకున్న వారికి సకల భాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ భక్తుల విశ్వాసం.

#బాలాపూర్ లడ్డు.

#balapur laddu.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5