ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలను విజయవంతం చేయండి
AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:
ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలను విజయవంతం చేయాలని AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలను విజయవంతం చేయండని AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలు సెప్టెంబర్ 28,29,30 ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని అట్టి మహాసభలకు రైతు, రైతు కూలీలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. ఆదివారం మహాసభ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ఎన్. ఆర్. భవన్ లో జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి లు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని అమెరికా యూరోపియన్ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇట్టి ఒప్పందాల మూలంగా సంపన్న దేశాలు ఆహార ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా మనదేశంలో కుప్పలు, కుప్పలుగా, దిగుమతి అవుతాయని మన ఉత్పత్తులను ఎగుమతి చేస్తే అధిక సుంకాలు విధిస్తారని వారన్నారు. ఈ విధంగా రైతు పంటలకు ధరలు లేక పెట్టుబడి ఖర్చులు పెరిగి మన దేశ రైతులను నిలువు దోపిడీకి అప్పుల చక్రబంధంలో చిక్కుకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఎం. ఎస్.పి (MSP ) మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంటులో తీసుక రావడంలో తీవ్రంగా విఫలమయ్యారని వారు అన్నారు ఇటీవల విద్యుత్ చట్టం, విత్తన చట్టం, వి రామ్ జి, చట్టాలను తీసుకువచ్చిన ఈ చట్టాల వల్ల రైతులు తమ భూముల నుండి బేధకల్ అయితారని రైతులు భూముల నుండి కూలీలు ఉపాధి నుండి దూరమవుతారని కావున నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నూతన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ఈ మహాసభలకు ప్రత్యేకత ఉన్నదని రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో, పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులందరినీ ఐక్యపరిచి బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మించడానికి తగిన కర్తవ్యాలను ప్రణాళికను ఈ సభలో రూపొందించుకుంటామని వారు తెలిపారు. ఈ మహాసభలు విజయవంతం చేయడానికి జిల్లా నుండి రైతు, రైతు- కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు బి. సాయిలు, జిల్లా నాయకులు అగ్గు చిన్నయ్య, రాపాని గంగాధర్,అనంతయ్య, నరసగౌడ్, రామా గౌడ్, తదితరులు పాల్గొన్నారు






