బడాభీమ్‌గల్ లో రూ. 40 లక్షలతో 4 మహిళా భవనాలకు భూమిపూజ
బడాభీమ్‌గల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘాల బలోపేతం కోసం మంజూరైన 4 మహిళా భవనాలు

బడాభీమ్‌గల్ లో రూ. 40 లక్షలతో 4 మహిళా భవనాలకు భూమిపూజ
మన ఇందూర్ న్యూస్/భీమ్‌గల్ రూరల్ : భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘాల బలోపేతం కోసం నూతనంగా మంజూరైన 4 మహిళా భవనాల నిర్మాణ పనులకు మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,గ్రామ సర్పంచ్ విష్ణువర్ధని కలసి భూమిపూజ నిర్వహించారు.ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం మొత్తం రూ. 40 లక్షల ఉపాధి హామీ (EGS) నిధులను కేటాయించింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఈ భవనాలు ఎంతో దోహదపడతాయన్నారు. మహిళా సంఘాల సమావేశాలు,శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి శాశ్వత వేదికగా నిలుస్తాయని తెలిపారు.నాలుగు మహిళా భవనాలకు నిధులు మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భీమ్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం,గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ నాయకులు రాగుల గంగా మోహన్, లింబాద్రి, మహిళ సంఘాలు నాయకులు పాల్గొన్నారు.






