Mana Indur News
స్థానిక వార్తలు

వ్యవసాయ మార్కెట్ యార్డులో 50 కేజీల బస్తాలను అనుమతించాలి

మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సెక్రటరీ విజయ్ కిషోర్ లకు వినతి పత్రం అందజేత

KA
By KARKA RAMESH•September 15, 2026
29
Share
వ్యవసాయ మార్కెట్ యార్డులో 50 కేజీల బస్తాలను అనుమతించాలి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

వ్యవసాయ మార్కెట్ యార్డులో 50 కేజీల మోత బరువు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. మంగళవారం ఏఐటీయూసీ మార్కెట్ యార్డ్ యూనియన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సెక్రటరీ విజయ్ కిషోర్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ.. ఐఎల్ఓ తీర్మానం ప్రకారం దేశవ్యాప్తంగా 50 కేజీల బస్తాల మోత అమలవుతుందని, మన రాష్ట్రంలోనే ఐకెపి సెంటర్లలో 40 కేజీల బస్తాను అమలు చేస్తున్నారని ఒక వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రమే 60 నుండి 110 కిలోల వరకు బస్తాల మోత బరువు అమలు చేస్తున్నారని ఇది పూర్తిగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధమని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కార్మికుడు ఎక్కువ కాలం పని చేయాలన్న 50 కేజీలకు మించి బరువులను ఎత్తకూడదని సూచించడం జరిగిందని పై నిబంధనలను అధికార యంత్రాంగం మార్కెట్ యార్డు పాలకవర్గం పరిగణలోకి తీసుకొని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూడా 50 కేజీల బస్తాలను అనుమతించాలని కోరుతున్నామన్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు పాలకవర్గం సెక్రెటరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అమలు కు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు అంజయ్య కార్యదర్శి సాయిలు కోశాధికారి నరేష్ ,వెంకటి, కిషన్ గౌడ్, రాజు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5