నిజామాబాద్ లో ముస్తాబవుతున్న 54 అడుగుల మట్టి గణనాధుడు
పర్యావరణహితం కోసమే తెలంగాణలో అతి పెద్ద మట్టి గణపతి

ముస్తాబవుతున్న భారీ 54 అడుగుల మట్టి గణనాధుడు
పర్యావరణ హితం కోసమే ఆలోచన చేసి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడే తయారు చేయించి అక్కడి నిమజ్జనం చేస్తున్నామని రవితేజ యూత్ నిర్వాహకులు తెలిపారు తెలంగాణ రాష్టంలోనే అతిపెద్ద 54అడుగుల మట్టి గణపతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లీలో రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్తాబవుతోందనీ అద్యక్షులు నీలగిరి రాజు తెలిపారు. కాలనీలో ఉన్న యువత అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు వినాయక చవితి పండగను జరపడం జరిగిందని, యువత అందరి సహకారంతో రవితేజ యూత్ గణేష్ మండలి 1987లో స్థాపించామన్నారు. తర్వాత 2012 గణేష్ మండలి సిల్వర్ జూబ్లీ సందర్బంగా రవితేజ యూత్ సొసైటీ గా మార్చినట్లు తెలిపారు. సిల్వర్ జూబ్లీ సందర్బంగా పర్యావరణన్ని కాపాడాలని ఉద్దేశం తో ఆనాటి నుంచి ఈనాటి వరకు భారీ మట్టి వినాయక విగ్రహాలు పెడుతూ జిల్లా రాష్ట్ర మన్ననలు పొందుతున్నామన్నారు. రాష్ట్రంలోనే భారీ మట్టి విగ్రహాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టించి పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సిద్ధం అయిన తర్వాత భక్తుల దర్శనార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని నీలగిరి రాజు తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని, చెరువులు కుంటలు వాగులు కలుషితం కాకుండా ఉంటాయన్నారు.






