Mana Indur News
స్థానిక వార్తలు

జాతీయ లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో 6649 రాజీపడి పరిష్కారం

సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 24,02,552-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేత

MI
By Mana Indur News•September 13, 2026
12
Share
జాతీయ లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో 6649 రాజీపడి పరిష్కారం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

రాజీ మార్గమే రాజా మార్గం అని రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆగస్టు నెల రోజుల నుంచి 2026 సెప్టెంబర్ 12 వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న  6649 రాజీపడి పరిష్కారం లభించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
🔷ఐ.పి.సి & BNS & ఎస్.ఎల్.ఎల్ = 462 కేసులు
🔷సైబర్ క్రైమ్ = 71 కేసులు
🔷ఇ-పెట్టి = 3109 కేసులు
🔷డి.డి & MV యాక్ట్ = 3007
మొత్తం =  6649 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు.  జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు , సైబర్ క్రైమ్ సిబ్బంది, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు.
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోకూడదన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చన్నారు.  ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని TSCSB [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో] డైరెక్టర్ శిఖాగోయల్ (ఐ.పి.ఎస్.) ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు,  ప్రతి జిల్లాలో D4C ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు.
నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 71 సైబర్ క్రైమ్ కేసులలో 24,02,552-00  రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.
జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చన్నారు.

ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన సి.సి.ఆర్.బి , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య  అభినందించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5