Mana Indur News
స్థానిక వార్తలు

సెవెంత్ బెటాలియన్‌లో ఘనంగా యువ ఆపదమిత్ర 7 రోజుల కోర్స్ ముగింపు కార్యక్రమం.

యువ ఆపదమిత్రులకు DRDO సాయన్న చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్లను అందజేత

Pi
By Pillolla Raju •September 22, 2026
10
Share
సెవెంత్ బెటాలియన్‌లో ఘనంగా యువ ఆపదమిత్ర 7 రోజుల కోర్స్ ముగింపు కార్యక్రమం.

మన ఇందూర్ / డిచ్ పల్లి :

సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపదమిత్ర (YAMS) కోర్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కోర్స్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన యువ ఆపదమిత్రులకు DRDO సాయన్న చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్లను అందజేశారు.యువ ఆపదమిత్రులకు విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, బోటింగ్ ప్రమాదాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ అందించారు. ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్, బోటింగ్, రెస్క్యూ ఆపరేషన్స్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందారు.ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన యువ ఆపదమిత్రులను అధికారులు అభినందించారు. ఆపద సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో యువ ఆపదమిత్రులు ముందుండాలని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సమాజ సేవకు ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాయన్న, డిస్టిక్ యూత్ ఆఫీసర్ బి రమేష్, తెలంగాణ యూనివర్సిటీ కోఆర్డినేటర్ కె అపర్ణ, బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ అనుపమ,ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

#ఆపదమిత్ర.

#డి ఆర్ డి ఓ.

#యామ్స్

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5