Mana Indur News
స్థానిక వార్తలు

71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక

రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి.

MI
By Mana Indur News•November 14, 2026
5
Share
71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక

71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక.

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని బాల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి తెలిపారు.71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించామన్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా బాలుర బాలికల క్రీడాకారుల ఎంపికలను జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించడం జరిగింది. ఎంపికలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది, ఈ ఎంపికలకు ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం పరిచయం చేసుకొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని బాల్ బ్యాట్మెంటన్ క్రీడకు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా జిల్లా సంఘం కృషి చేస్తుందని రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పథకాలు సాధిస్తుందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది.ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22వ తేదీ నుంచి 24 వరకు కమలాపూర్ హై స్కూల్ హనుమకొండ జిల్లాలో జరిగే 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర బాలికల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.ఎంపిక కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ,కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కార్యవర్గం సభ్యులు భాగ్యశ్రీ, , షామేందర్ ,కార్తీక్ ,మరియు వ్యాయామ ఉపాధ్యాయులు నవీన ,విజయలక్ష్మి పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5