Mana Indur News
స్థానిక వార్తలు

జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 75 శాతం రాయితీ

అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు

KA
By KARKA RAMESH•September 23, 2026
11
Share
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 75 శాతం రాయితీ

ప్రొసీడింగ్ జారీ చేసిన డిఈఓ

హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు .

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:

ప్రైవేట్ అనైడేడ్ పాఠశాలలో అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు 75 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొసీడింగ్ కాపీని విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం ఆధ్వర్యంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించి 75 శాతం రాయితీ ఇస్తూ సెప్టెంబర్ 22 న ప్రొసీడింగ్ కాపీని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాయితీ కోసం కృషిచేసిన
ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు పంచారెడ్డి శ్రీకాంత్, వాగ్మేరే సుభాష్ లతో పాటు కార్య వర్గానికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5