ప్రభుత్వాసుపత్రిలో 750 బెడ్ లకు బడ్జెట్ ను వెంటనే కేటాయించి కార్మికులను పెంచాలి
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై .ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్

మన ఇందూర్/ నిజామాబాద్ అర్బన్:
ప్రభుత్వాసుపత్రిలో 750 బెడ్ లకు బడ్జెట్ ను వెంటనే కేటాయించి కార్మికులను పెంచాలనీ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై .ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్ కోరారు. గురువారం
ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారం
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై .ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్ లు మాట్లాడుతూ.. GGH నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 615 బెడ్ లకు మాత్రమే కేటాయించడం జరిగిందని అన్నారు. GGH కు నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్,కామారెడ్డి జగిత్యాల, మహారాష్ట్రలకు సంబంధించి అనారోగ్యాలకు గురైన ప్రజలు వస్తున్నారని కనీసం ప్రతిరోజు 2000 తగ్గకుండా అవుట్ పేషెంట్ ఉంటున్నారని, రోజుకు 200 మంది ఇన్ పేషెంట్లు జాయిన్ అవుతున్నారని, కనీసం 1000 బెడ్లకు పెంచాలని ఏఐటీయూసీగా పోరాడుతుంటే గత రెండు సంవత్సరాల క్రితం 750 బిడ్డలకు (పడకలకు) అనుమతించారని కానీ బడ్జెట్ కేటాయించకపోవడంతో 615 బెడ్ లకు సంబంధించిన కార్మికులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తో పాటు నూతనంగా ప్రారంభమైన మాతా శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్నారని దీని ద్వారా కార్మికులపై విపరీతమైన పని భారం పడి అనారోగ్యాలను పాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే 750 బెడ్ లకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించాలని, కార్మికులకు పని భారం తగ్గించాలని, పనిముట్లు ఇవ్వాలని లేనియెడల యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫెరోజ్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వరూప, కవిత,భారతి, పవిత్ర, సాయి,వెంకటేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.






