Mana Indur News
Crime news

పేకాట ఆడుతూ పట్టుబడిన 9 మంది

రూ.7,880 నగదు, 6 సెల్‌ఫోన్లు, 5 బైక్‌లు స్వాధీనం

MI
By Mana Indur News•November 17, 2026
0
Share
పేకాట ఆడుతూ పట్టుబడిన 9 మంది

పేకాట ఆడుతూ పట్టుబడిన 9 మంది

రూ.7,880 నగదు, 6 సెల్‌ఫోన్లు, 5 బైక్‌లు స్వాధీనం

మన ఇందూర్ న్యూస్/బాల్కొండ:

బాల్కొండ ఊర చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు బాల్కొండ ఎస్ఐ యాసీర్ అరాఫత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, తొమ్మిది మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.7,880 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ యాసీర్ అరాఫత్ మాట్లాడుతూ పేకాట వంటి జూదం అలవాట్లు కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. ఎవరూ పేకాట వైపు వెళ్లవద్దని, ఎవరైనా పేకాట ఆడుతూ పట్టుబడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5