నెమళ్లను వేటాడి చంపిన ఐదుగురి అరెస్టు
ఎస్ ఐ యాసిర్ అర్ఫాద్
KA
By KARKA RAMESH•November 13, 2026
2

నెమళ్లను వేటాడి చంపిన ఐదుగురి అరెస్టు
మన ఇందూర్ న్యూస్/బాల్కొండ:
జాతీయ పక్షులైన రెండు నెమళ్లను వేటాడి చంపిన ఐదుగురిని బాల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై యాసిర్ అర్ఫాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం బాల్కొండ శివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా రెండు చనిపోయిన నెమళ్లు, టార్చ్‌లైట్, బ్యాటరీ, వేట వల లభించాయి. అరెస్టయిన వారిని సంగీల నరసింహ, మేరికల్ అంకంరావు, మేకల రామయ్య, మెలిక కళ్యాణ్, మెరికా అంకంరావుగా గుర్తించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






