ధర్పల్లి మండలం రామడుగులో చైన్ స్నాచింగ్
నిజామాబాద్ వెళ్లేందుకు బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తి

నిజామాబాద్ వెళ్లేందుకు బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా చైన్ స్నాచింగ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి
మన ఇందూర్ న్యూస్/ధర్పల్లి:
నిజామాబాద్ వెళ్లేందుకు గ్రామంలో మహిళ బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి. చైన్ స్నాచింగ్ చేసిన ఘటన కలకలం రేపింది.
ధర్పల్లి ఎస్ ఐ జి.సందీప్ వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రామడుగు గ్రామానికి చెందిన ఫిర్యాదురాలు గడ్డం పద్మ శనివారం ఉదయం తన ఇంటి నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు బస్ స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై ఎదురుగా వచ్చి, ఎరుపు రంగు స్వెటర్ ధరించి, అకస్మాత్తుగా ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై బాధితురాలు ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సందీప్ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు పోలీసు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టామని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని ఎస్ ఐ తెలిపారు.






