99 రూపాయలకే లక్కీ డ్రాలో మూడు బస్తాల యూరియా
బంజారా కింగ్స్ యూత్ వినూత్న నిరసన..
KA
By KARKA RAMESH•September 19, 2026
19

మన ఇందూర్ భీంగల్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్ల నాయక్ తండాలో బంజారా కింగ్స్ యూత్ వినూత్న నిరసన తెలిపారు. వినాయక మండపం వద్ద 99 రూపాయల కూపన్ తీసుకుంటే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మూడు బస్తాల యూరియా ఇస్తామని చెప్పడంతో రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను అధికారులకు నాయకులకు తెలియజేయాలని ఇలా చేశామని సభ్యులు తెలిపారు. 99 లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మూడు యూరియా బస్తాలు ఇస్తామని చెప్పడం విశేషం. పంటలకు అవసరమైన సమయంలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే రైతుల పక్షాన నిలవాలని ఈ సందర్భంగా కోరారు. అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించేందుకే ఈ నిరసన చేపట్టినట్లు వారు తెలిపారు.






