గోవిందా నామస్మరణల మధ్య జెండా ఊరేగింపు.
ముగిసిన జెండా బాలాజీ ఉత్సవాలు.. భక్తులతో కిటకిటలాడిన జెండా బాలాజీ ఆలయం.

ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందాగోవిందా!!
బాలాజీ భగవాన్ కి జై... అంటూ భక్తులు గోవిందుని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో జెండా జాతర కొనసాగింది. గత 15 రోజులుగా జిల్లా కేంద్రంలోని బాలాజీ మందిరం లోని ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం అధిక సంఖ్యలో భక్తులు జెండాను దర్శించుకుని పూజలు నిర్వహించారు
మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్
జెండా జాతర ఉత్సవాలు శనివారం ముగిశాయి. గోవిందా నామస్మరణల మధ్య జెండా ఊరేగింపు భక్తిశ్రద్ధలతో కొనసాగింది ఉదయం నుంచి భక్తులతో జెండా బాలాజీ ఆలయం కిటకిటలాడింది.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా...
వడ్డీ కాసుల వాడా శ్రీనివాస ఆపద మొక్కుల వాడా.. గోవిందా గోవిందా... బాలాజీ భగదాన్ కి జై. అంటూ భక్తుల నామస్మరణల మధ్యభక్తి శ్రద్ధలతో జెండా జాతర సాగింది. గత 15రోజులుగా జిల్లా కేంద్రంలోని బాలాజీ మందిరంలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఆధికనంఖ్యలో భక్తులు జండాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జెండాకు వంశపారంవర్యంగా ఉన్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునికి వంశీకులు అజయ్ సాంగ్వాయి సంజయ్ సాంగ్ వాయి విజయ్ సాంగ్ వారు ప్రత్యేక పూజలు చేశారు. జెండా బాలాజీ మందిరం నుంచి జెండాను ముందుగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోడపై నుంచి దాటించారు. జెండాను సిర్నాపల్లి గడి లో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి గోల్ హనుమాన్ చేరుకున్న జెండాకు భక్తులు చక్కెరను స్వామివారికి సమర్పించుకుని పూజలు నిర్వహించారు. ఊరేగింపుగా సిర్మాపల్లి గడి మీద నుంచి ఫులాంగ్ వరకు శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెండా జాతర వేడుకలు సాంప్రదాయంగా వస్తున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. బిజెపి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ హాజరై జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త హాజరై జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా జెండా బాలాజీ ఉత్సవాలు కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవం వెంకటేశ్వర స్వామి అని అన్నారు. నిజాంబాద్ సిపి సాయి చైతన్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు సాగిన ఊరేగింపు. పూలాంగ్ వరకు చేరుకోగానే సాంగ్ వాయి వంశీకులు జెండాకు విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం జెండా నాలుగు రోజుల పాటు పూలాంగ్ వద్ద పూజలు అందుకుంటుందని వంశీకులు తెలిపారు ఈ సందర్భంగా భక్తమండలి బృందంచే కోలాటాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శివరాత్రి ఆంజనేయులు, చైర్మన్లు లవంగ ప్రమోద్, జాలిగం, గోపాల్ కుమార్, పోలకొండ నర్సింగ్ రావు, , అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్, ఆలయ అర్చకులు వెలుగలేటి నాగరాజు చారి, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు






